బాద్షా సెన్సార్ డేట్ ఖరారు

Baadshah8
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన ‘బాద్షా’ సినిమా ఏప్రిల్ 1న సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోనుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ఈ సినిమాని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మించారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కామెడీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

కామెడీని తెరపై చూపించడంలో శ్రీను వైట్లకి మంచి పేరుంది. బ్రహ్మానందం, ఎం.ఎస్ నారాయణ, జయప్రకాశ్ రెడ్డి మొదలైన కామెడీ యాక్టర్స్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎన్ టి ఆర్ కెరీర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు.

Exit mobile version