భద్రతా కారణాల వల్ల బాద్ షా ఆడియో విడుదలలో మార్పు..

భద్రతా కారణాల వల్ల బాద్ షా ఆడియో విడుదలలో మార్పు..

Published on Mar 6, 2013 7:00 PM IST

Baadshah

యంగ్ టైగర్ ఎన్. టి. ఆర్ నటించిన ‘బాద్ షా’ ఆడియో విడుదల హైదరాబాద్లో ప్రకటించిన రెడ్ అలెర్ట్ కారణంగా మర్చి 10 నుండి 17కి వాయిదా పడింది. తీవ్రవాదుల దాడుల నేపద్యం వలన ఈ వేడుకని వాయిదా వేయమని డి. జి. పి కోరారంట. ఇంటలిజెన్స్ బ్యురో సమార్చారం మేరకు మరి కొన్ని రోజుల్లో దాడులు జరిగే అవకాశం ఉందంట. భద్రతా కారణాల వల్ల వాణిజ్య కేంద్రాలైన అమీర్ పేట్, బేగంబజార్, కోటి లను మూసివేసారు.

థమన్ సంగీతం అందించిన ఈ సినిమాకి శ్రీను వైట్ల దర్శకుడు. కాజల్ అగర్వాల్ హీరొయిన్. పరమేశ్వరా ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.

తాజా వార్తలు