‘అయ్యపనుమ్ కోషియుమ్’ నటుడు మృతి

‘అయ్యపనుమ్ కోషియుమ్’ నటుడు మృతి

Published on Dec 25, 2020 11:36 PM IST

మలయాళ సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం ప్రముఖ దర్శకుడు సానవాస్ షూటింగ్ స్పాట్లోనే బ్రెయిన్ డెడ్ అవడంతో హాస్పిటల్లో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించాడు. టాలెంటెడ్ దర్సకుడు ఇలా అకస్మాత్తుగా మరణించడంతో పరిశ్రమ మొత్తం షాకైంది. ఈ విషాదాన్ని మరువక ముందే ఒక నటుడు అనిల్ పి నేదుమంగాడ్ కన్నుమూయడం అందరినీ కలచివేస్తోంది.

అనిల్ పీ నేదుమంగాడ్ శుక్రవారం సాయంత్రం స్నేహితులతో కలిసి ఎర్రాకుళం జిల్లా మువత్తుపుళం వెళ్లారు. స్నేహితులతో కలిసి మలంకర డ్యామ్‌‌లో స్నానం చేస్తుండగా అనిల్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. అది గమనించిన స్నేహితులు ఆయన్ను బయటకు తీసుకొచ్చి ప్రథమ చికిత్స అందించారు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి అతడిని తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్టు ధృవీకరించారు అక్కడి వైద్యులు. అనిల్ ఇటీవల విడుదలైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రంలో సీఐ సతీష్ కుమార్ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో పవన్ రీమేక్ చేస్తున్నారు. అనిల్ మృతిపై పృథ్వీరాజ్, దుల్కర్ సల్మాన్ సహా మలయాళ చిత్ర ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

తాజా వార్తలు