‘వీరమల్లు’ రిలీజ్ పై అవైటెడ్ క్లారిటీ వచ్చేస్తుందా?

‘వీరమల్లు’ రిలీజ్ పై అవైటెడ్ క్లారిటీ వచ్చేస్తుందా?

Published on May 8, 2025 8:08 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ కెరీర్లో చేసిన మొదటి పాన్ ఇండియా సహా ఒక పీరియాడిక్ వారియర్ సినిమా ఇది కావడంతో అప్పట్లో ఉన్న హైప్ వేరు. మరి ఇపుడు ఎట్టకేలకి సినిమా కంప్లీట్ అయ్యి రిలీజ్ కి రాబోతుంది.

మొన్ననే పవన్ కళ్యాణ్ పోర్షన్ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ పై ఇదే ఆఖరి డేట్ గా కొత్త డేట్ కి ఇపుడు రంగం సిద్ధం అయ్యింది. అయితే ఈ చిత్రంపై క్లారిటీ ఇవాళే వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ బిగ్ అప్డేట్ పై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు