యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన ‘ఆటోనగర్ సూర్య’ సినిమా డిసెంబర్ లో విడుదల కావడానికి సిద్దం అవుతోంది. చాలా రోజుల విరామం తరువాత ఈ సినిమా తిరిగి ప్రారంభమయింది. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవా కట్ట దర్శకత్వం వహించాడు. డైరెక్టర్ దేవా కట్ట మాట్లాడుతూ ప్రస్తుతం సాయి కుమార్ డబ్బింగ్ కార్యక్రమం జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 90% సినిమా పూర్తయ్యింది. త్వరలో మిగిలిన బాగం పూర్తవుతుందని అన్నారు. ఈ సినిమాకి అనుప్ రుబెన్స్ సంగీతాన్ని అందించాడు. ఆర్.ఆర్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిందని సమాచారం.