ఆటోనగర్ సూర్య మళ్ళీ సెట్స్ పైకి వెళ్లనుందా?

autonagar-surya
అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఆటోనగర్ సూర్య’ సినిమా భారీ అంచనాల నడుమ మొదలయ్యింది. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకున్న తరుణంలో కొన్ని ఫైనాన్సియల్ ఇబ్బందుల వల్ల ఆగిపోయింది. అప్పటికే విడుదలైన డిజిటల్ పోస్టర్ ఈ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ సినిమాని ఆర్ఆర్ మూవీ మేకర్స్ కి అనుబంధ సంస్థ అయిన మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె. అచ్చిరెడ్డి నిర్మించారు. ప్రస్తుతం ఉన్న ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉన్న ఈ నిర్మాణ సంస్థ సినిమాని పూర్తి చెయ్యలేక ఆపేసింది. తాజాగా ఈ చిత్ర డైరెక్టర్ దేవకట్టా వేసిన ట్వీట్ తో ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అక్కినేని ఫ్యాన్స్ కి ఒక శుభవార్త చెప్పారు.

‘ఆటోనగర్ సూర్య చివరి దశ పనులు త్వరలోనే మోదలవుతాయి. చాలా విషయాలు తెలుసుకున్న తర్వాత నేను ఇదివరకూ ట్విట్టర్ లో వేస్తున్న ట్వీట్స్ తీసేస్తున్నానని’ దేవకట్టా ట్వీట్ చేసాడు. దీన్ని బట్టి చూస్తుంటే త్వరలోనే మళ్ళీ సెట్స్ పైకి వెళ్లి సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ అవుతుందని అనిపిస్తోంది.

Exit mobile version