నాటి 100 రోజుల వేడుకలే నేటి ఆడియో విడుదల వేదికలు

ఒకప్పుడు సినిమా 100 రోజులు ఆడింది అంటే సూపర్ హిట్ అనే వారు, 175 రోజులు ఆడితే బ్లాక్ బస్టర్ హిట్ అనేవారు. అలా ఎక్కువ రోజులు ఆడిన సినిమాలకు 100 రోజుల వేడుకలు, 175 రోజుల వేడుకలు అంటూ చేసేవారు. ఈ వేడుకలు అంగరంగ వైభవంగా అభిమానుల మధ్య ఘనంగా చేసేవారు. ఈ రోజుల్లో సక్సెస్ లెక్కలన్నీ మారిపోతున్నాయి. అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తుండటం వల్ల సూపర్ హిట్ సినిమాలు 5 నుడి 6 వారాలు మించి ఆడటం కష్టమైపోతుంది. అంతకుమించి ఆడితే బ్లాక్ బస్టర్ హిట్ అన్నట్లే. ఈ రోజుల్లో 100 రోజుల వేడుకలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. కొత్త ట్రెండ్ ఆడియో విడుదల వేడుకనే 100 రోజుల వేడుక లాగా ఘనంగా, భారీగా నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల్లో ఈ 100 రోజుల వేడుకలు పూర్తిగా కనుమరుగయి పోతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వేడులకలన్ని ఎక్కువ భాగం అభిమానుల కోసం ఉంటాయి కాబట్టి వారి సరదాని ఆడియో విడుదల వేడుకలో తీరుస్తున్నారు.

Exit mobile version