ఇండియన్ ఐడల్ విన్నర్, సింగర్ అయిన శ్రీ రామచంద్ర హీరోగా నటిస్తున్న తొలి సినిమా ‘ప్రేమ గీమా జాంతా నై’. ఆంధ్రా యూనివర్శిటి స్టూడెంట్స్ అడ్డుకోవడంతో విశాఖపట్నంలో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. యూనివర్శిటి లైబ్రరీలలో సినిమాలు తీయడాన్ని స్టూడెంట్స్ వ్యతిరేఖించారు, ఎందుకంటే దాని వల్ల లైబ్రరీలలో చదువుకోవడానికి ఇబ్బందవుతోందని స్టూడెంట్స్ అన్నారు. ఆర్. వి సుబ్బు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని దడి బాల భాస్కర్ – ముద్దల భాస్కర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సినిమా ఉంటుందని అంచనా వేస్తున్నారు.