బాక్సాఫీస్ వద్ద అశ్వథామ వసూళ్ల సందడి

బాక్సాఫీస్ వద్ద అశ్వథామ వసూళ్ల సందడి

Published on Feb 4, 2020 1:39 PM IST

యంగ్ హీరో నాగ శౌర్య యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ అశ్వథామ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ దక్కించుకుంటుంది. విడుదలైన నాలుగు రోజులలో 11.95 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. వర్కింగ్ డే నిన్న సోమవారం కూడా అశ్వథామ మంచి వసూళ్లు దక్కించుకుంది. నిన్న ఈ మూవీ 1.6 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం. దీనితో త్వరలోనే అశ్వథామ బ్రేక్ ఈవెన్ పాయింట్ కి చేరే అవకాశం కలదు.

నాగ శౌర్య ఈ విజయాన్ని ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. ఆయన ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమలోని ప్రధాన నగరాలలో సక్సెస్ టూర్ నిర్వహించడం జరిగింది. ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో ఉషా మూల్పూరి అశ్వథామ చిత్రాన్ని నిర్మించారు. హీరోయిన్ మెహ్రిన్ మొదటిసారి నాగ శౌర్యకి జంటగా నటించారు. నూతన దర్శకుడు రమణ తేజ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కగా శ్రీచరణ్ పాకాల పాటలు అందించారు.

తాజా వార్తలు