కరోనా విపత్తుని ఎదుర్కోవడంలో సినిమా పరిశ్రమ ముందుకు వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్ధిక సాయం చేయడం జరిగింది. దేశ వ్యాప్తంగా ఉన్న అనేక చిత్ర పరిశ్రమలకు చెందిన హీరోలు, హీరోయిన్స్, దర్శకులు మరియు నిర్మాతలు వారివారి స్థోమతకు తగ్గట్టుగా ఆర్ధిక సాయం ప్రకటించారు. టాలీవుడ్ నుడి హీరో ప్రభాస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి ఏకంగా 4 కోట్ల రూపాయల విరాళం ప్రకటించడం విశేషం.
కాగా దేశంలో అతిపెద్ద సినిమా థియేటర్స్ చైన్ కలిగి మరియు నిర్మాణ సంస్థగా ఉన్న ఏషియన్ సినిమాస్ తెలంగాణ సి ఎమ్ రిలీఫ్ ఫండ్ కి 21లక్షల అర్ధిక సాయం ప్రకటించారు. ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ మంత్రి కేటీఆర్ అని స్వయంగా కలిసి ఆ చెక్ అందజేయడం జరిగింది. ఇక ఏషియన్ సినిమాస్ బ్యానర్ లో ప్రస్తుతం శేకర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పలవి జంటగా లవ్ స్టోరీ అనే చిత్రం తెరకెక్కుతుంది.