2012లో పవన్ కళ్యాణ్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఫ్యాన్స్ కి పిచ్చ కిక్ ఇచ్చింది. అప్పటి వరకు సరైన విజయం కోసం సతమతమవుతున్న పవన్, గబ్బర్ సింగ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. హిందీ హిట్ మూవీ దబంగ్ కి తెలుగు రీమేక్ గా వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ పవన్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకుంది. దర్శకుడు హరీష్ ఒరిజినల్ కథకు చాలా మార్పులు చేసి, పవన్ మేనరిజం కి సరిపోయేలా స్ట్రైట్ మూవీ అన్నట్లుగా తెరకెక్కించాడు.
ముఖ్యంగా హరీష్ శంకర్ రాసిన వన్ లైనర్స్ తెరపై ఓ రేంజ్ లో పేలాయి. కాగా ఈ సినిమా విడుదలై రేపటికి 8 సంవత్సరాలు. 2012 మే 8న గబ్బర్ సింగ్ విడుదలైంది. కాగా సోషల్ మీడియాలో గబ్బర్ సింగ్ మూవీ 8ఇయర్స్ యాష్ ట్యాగ్ తో సందడి చేయడానికి ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ట్విట్టర్ లో ఈ యాష్ ట్యాగ్ ట్రెండ్ చేయడానికి ఫ్యాన్స్ ప్రణాళికలు వేస్తున్నారు. రేపు గబ్బర్ సింగ్ మూవీ యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియా ఊగిపోవడం ఖాయం.