అరవింద్ – మీనాక్షిల ‘అడవి కాచిన వెన్నెల’

Adavi-Kachina-Vennela
‘ఇట్స్ మై లవ్ స్టొరీ’, ‘ఋషి’ సినిమాలతో తెలుగు వారికి పరిచయమైన అరవింద్ కృష్ణ ఈ మధ్య కాలంలో కాస్త సైలెంట్ గా ఉన్నాడు. కానీ అతను సైలెంట్ గా చాలా సినిమాలు చేసేస్తున్నాడు. త్వరలోనే అరవింద్ హర్షద్ విదేయ తీస్తున్న ‘సారధి’ సినిమాలో నటిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ‘మరో థ్రిల్లర్ సినిమా కూడా చేస్తున్నాడు. కొత్తవాడైన అక్కి విశ్వనాధ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి ‘అడవి కాచిన వెన్నెల’ అనే టైటిల్ ని ఖరారు చేసారు.

‘దూకుడు’,’బాద్షా’ సినిమాల్లో ఐటెం గర్ల్ గా మెరిసిన మీనాక్షి దీక్షిత్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది. ఐటెం గర్ల్ గానే కాకుండా గత సంవత్సరం శ్రీ కాంత్ హీరోగా వచ్చిన దేవరాయ సినిమాలో ఆస్థాన నర్తకిగా కనిపించి అందాలు ఆరబోసిన మీనాక్షి ‘అడవి కాచిన వెన్నెల’ సినిమాలో పూర్తి గ్లామరస్ పాత్ర చేయనుంది. ఏప్రిల్ మధ్యలో మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికి దాదాపు పూర్తయ్యింది. త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేయనున్న ఈ సినిమాకి నాని వినీల్ మ్యూజిక్ డైరెక్టర్ గా, సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

Exit mobile version