‘ఇట్స్ మై లవ్ స్టోరీ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అరవింద్ కృష్ణ ప్రస్తుతం ‘బిస్కెట్’ సినిమాతో మనముందుకు రానున్నాడు
సెప్టెంబర్ లో ఈ సినిమా ఆడియో విడుదలైంది. నవంబర్ చివరివారంలో ఈ సినిమా విడుదలకావచ్చు. ఈ సినిమా కామెడీని మేళవించిన ఫ్యామిలీ ఎంటెర్టైనర్ గా తెరకెక్కింది.
ఈ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు ముగించుకుని ‘యు’ సర్టిఫికేట్ ను సొంతం చేసుకుంది. వెన్నెల కిషోర్ మరియు తాగుబోతు రమేశ్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషించారు.
డింపల్ చొప్దే హీరోయిన్. ఈ కినేమాకు అనీల్ గోపాల్ రెడ్డి దర్శకత్వమే కాక సంగీతాన్ని కూడా అందించాడు. గోదావరి ప్రొడక్షన్ బ్యానర్ పై స్రవంతి మరియు రాజ్ ఈ కినేమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు