మణిరత్నం లేటెస్ట్ మూవీ కడలి గత శుక్రవారం విడుదలై నెగటివ్ టాక్ సంపాదించుకుంది. అటు విమర్శకులని మెప్పించలేక, ఇటు ప్రేక్షకులని మెప్పించలేకపోయిన మణిరత్నం సినిమాల్లోనే వీకేస్ట్ సినిమాగా పేరు తెచ్చుకుంది. అరవింద్ స్వామి, అర్జున్ లాంటి నటులు ఉన్నా కూడా, మణిరత్నం అభిమానులను సైతం నిరాశ పరిచింది. సినిమా చూసిన చాలా మంది ఆడియెన్స్ విమర్శల్ని గుప్పిస్తుండగా అరవింద్ స్వామి మాత్రం కడలి సినిమాని సమర్దించుకున్నాడు. సినిమా మీద వస్తున్న నెగటివ్ కామెంట్స్ పట్టికోవద్దని అంటున్నాడు. సాధారణ ప్రేక్షకులు మాత్రం గతంలో వచ్చిన అమృత, యువ, రావన్ లాంటి సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా పడ్డాయి కానీ అందులో మణిరత్నం మార్కు కనిపిస్తుందనీ, కడలిలో అది పూర్తిగా మిస్సయిందని అంటున్నారు. మణిరత్నం పట్టు కోల్పోతున్నాడు అనేది కామన్ ఆడియెన్స్ కామెంట్.