మరోసారి ఎన్.టి.ఆర్ ప్రశంసించిన హరీష్ శంకర్

Ramaiya-Vastavaiya

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇండస్ట్రీలో మంచి నాలెడ్జ్ ఉన్న అలాగే కష్టపెట్టకుండా పెర్ఫామెన్స్ చేయగల నటుడు. డైరెక్టర్ హరీష్ శంకర్ ఎన్.టి.ఆర్ నటించిన ‘ రామయ్యా వస్తావయ్యా’ సినిమాకి దర్శకత్వం వహించాడు. గతంలో ఆయన ఎన్.టి.ఆర్ పెర్ఫార్మెన్స్ గురించి ప్రశంసించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నిన్న హరీష్ శంకర్ మరోసారి ఎన్.టి.ఆర్ ను ప్రశంసించాడు.’ఎన్.టి.ఆర్ కష్టపెట్టకుండా పెర్ఫామెన్స్ చేయగల నటుడు. అయన డాన్స్, డైలాగ్స్ చెప్పే విదానం, ఫైట్స్ అన్ని చాలా బాగుంటాయి’. అని హరీష్ శంకర్ ట్వీట్ చేశాడు.

‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా సెప్టెంబర్ లో విడుదల కావడానికి సిద్దమవుతోంది. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మించాడు.

Exit mobile version