ప్రభాస్ అనుష్కలది బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్. ఇప్పటికే ఈ జంట తెరపై నాలుగు సార్లు కనిపించారు. మొదటిసారి బిల్లా చిత్రం కోసం అనుష్క, ప్రభాస్ కలిసి నటించడం జరిగింది. ఆ తరువాత కొరటాల శివ తెరకెక్కించిన మిర్చి ఆ తరువాత బాహుబలి, బాహుబలి 2 చిత్రాలలో కలిసి నటించారు. కాగా సాహోలో సైతం అనుష్క ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించాల్సిందట.
సాహో సినిమాలో ఓ ప్రత్యేక గీతం కోసం అనుష్క ను నిర్మాతలు సంప్రదించారట. దీని పట్ల అనుష్క ఆసక్తిగా ఉన్నప్పటికీ నిశ్శబ్దం మూవీ షూటింగ్ డిస్టర్బ్ అయ్యే పరిస్థితి ఏర్పడిందట. అనుష్కను వారం డేట్స్ అడుగుగా డేట్స్ అడ్జస్ట్ చేయలేక పోయారట. తన వల్ల మొత్తం నిశ్శబ్దం టీం ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడడంతో అనుష్క ఆ స్పెషల్ సాంగ్ లో చేయలేకపోయారట.