నవంబర్ 22న రానున్న అనుష్క ‘వర్ణ’

varna

యోగా బ్యూటీ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన భారీ బడ్జెట్ మరియు గ్రాఫికల్ మూవీ ‘వర్ణ’ నవంబర్ 22న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. చాలా గ్రాండ్ గా చిత్రీకరించిన ఈ సినిమాలో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఆశిస్తున్నారు. ఈ సినిమా ఆడియోని ఈ నెల 27న హైదరాబాద్ లో లాంచ్ చేయనున్నారు. వర్ణ కి హారిస్ జైరాజ్ మ్యూజిక్ అందించాడు.

సెల్వ రాఘవన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని పివిపి సినిమా బ్యానర్ పై ప్రసాద్ వి పొట్లూరి నిర్మిస్తున్నాడు.
ఇటీవలే పివిపి సినిమా వారు ‘బలుపు’ తో హిట్ అందుకున్నారు, అలాగే వీరు ఎక్కడా రాజీ పడకుండా మార్కెటింగ్ మరియు ప్రమోషన్స్ చేస్తారన్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీలో అనుష్కకి జోడీగా తమిళ హీరో ఆర్య నటించాడు.

Exit mobile version