టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఘాటి’ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు సెప్టెంబర్ 5న ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా పూర్తి క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఈ చిత్ర ప్రమోషన్స్‌ను మేకర్స్ వేగవంతం చేశారు. దర్శకుడు క్రిష్, నిర్మాత రాజీవ్ రెడ్డి ఈ సినిమాను తమ భుజాలపై వేసుకుని ప్రమోట్ చేస్తున్నారు. అయితే, ఈ చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొనేందుకు అనుష్క నో చెప్పినట్లు తెలుస్తోంది. ఆమె లాస్ట్ మూవీ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ప్రమోషన్స్‌కు కూడా అనుష్క దూరంగా ఉంది. హీరో నవీన్ పొలిశెట్టి సినిమా ప్రమోషన్స్‌ను ఒంటిచేత్తో లాక్కురావడంతో ఆ సినిమాపై ప్రేక్షకులు ఆసక్తి చూపారు.
కానీ, ఘాటి సినిమాలో హీరోగా తమిళ నటుడు విక్రమ్ ప్రభు నటిస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులు ఆయనను పెద్దగా గుర్తుపట్టరు. మరి ఈ చిత్ర ప్రమోషన్స్‌ను కేవలం డైరెక్టర్, ప్రొడ్యూసర్ చేస్తే ఈ సినిమాపై రావాల్సిన ఇంపాక్ట్ ప్రేక్షకుల్లో వస్తుందా..? అనేది ఇప్పుడు అనుష్క ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతుంది. మరి ఈ సినిమా కోసం అనుష్క కనీసం ఓ వీడియో ప్రమోషన్ అయినా చేస్తే బాగుంటుందని వారు కోరుతున్నారు.