టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఘాటి’ ఎప్పుడో రావాల్సి ఉంది. కానీ ఈ చిత్రం పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేసిన ఈ క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో అనుష్క నెవర్ బిఫోర్ పాత్రలో నటిస్తుంది. పూర్తి వయొలెన్స్ చిత్రంగా ఈ సినిమాను క్రిష్ రూపొందించినట్లు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ చూస్తే అర్థమవుతుంది.
ఇక తాజాగా ఈ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్‌లో ఉన్నదానికంటే ఎక్కువ వయొలెన్స్ ఈ ట్రైలర్‌లో చూపెట్టారు. దీంతో ఈ సినిమాతో క్రిష్ మనకు ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నాడో అర్థమవుతుంది. ఇక గంజాయి సరఫరా చేసే పాత్రలో అనుష్క రస్టిక్ పర్ఫార్మెన్స్‌తో ఇరగదీసింది. ఈ ట్రైలర్‌లో ఆమె పర్ఫార్మెన్స్ శాంపిల్ మాత్రమే మనకు చూపెట్టారు. కథలో లోతు.. దానికి తగ్గ ఎమోషన్స్.. వాటికి అదనంగా యాక్షన్ కలగలిపి ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించనున్నారు.
మొత్తానికి అనుష్క ఫ్యాన్స్ ఎంతోకాలంగా వెయిట్ చేస్తున్న సినిమా ఎట్టకేలకు వారి ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో విక్రమ్ ప్రభుతో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాగర్ నాగవెల్లి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.