స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఘాటి’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆకట్టుకోవడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే, ఈ సినిమాను ఏప్రిల్ 18న రిలీజ్ చేస్తున్నట్లు గతంలోనే మేకర్స్ వెల్లడించారు. కానీ, ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ఈ సినిమా పరిస్థితి అయోమయంగా మారింది. దీనిపై మేకర్స్ కూడా సైలెంట్‌గా ఉండిపోయారు. దీంతో అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారనే ప్రశ్న అభిమానుల్లో వినిపిస్తోంది.
క్రిష్ నుంచి ఓ సాలిడ్ మూవీ వచ్చి చాలా రోజులు అవుతుంది. ఈ సినిమాతో ఆయన తిరిగి తన సత్తా చాటడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. మరి ఇప్పటికైనా ఈ సినిమా రిలీజ్ పై మేకర్స్ ఓ క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిమానులు అంటున్నారు.