టాలీవుడ్ లో గ్లామరస్ హీరోయిన్ అనుష్క జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసినదే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. ఇప్పుడు ఈ షూటింగ్ బృందంలోకి అనుష్క కూడా జతకలిసింది. మునుపటి తరం నటీమణి రమ్యకృష్ణ మరియు సత్యరాజ్ తదితర సీనియర్ నటులు షూటింగ్లో పాల్గుంటున్నారు.
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో హీరో. రానా దగ్గుబాటి అతని తమ్ముడిగా కనిపిస్తాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఆర్కా మీడియా బ్యానర్ తెలుగు చరిత్రలోనే అత్యధికంగా ఖర్చు పెడుతున్న సినిమాగా తెరకెక్కుతుంది.
ఎం.ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. సెంథిల్ సినిమాటోగ్రాఫర్. పీటర్ హైన్స్ ఫైట్ మాస్టర్