పవర్ ఫుల్ పాత్రలకు అనుష్కనే అంటున్న డైరెక్టర్స్

Anushka
​అనుష్క నటించిన అరుంధతి సినిమా సూపర్ హిట్ అయినప్పటి నుండి సినిమాలలో ఏదైనా పవర్ ఫుల్ పాత్ర చేయాలంటే అనుష్క పేరు మాత్రమే దర్శకులకు గుర్తుకు వస్తుంది. ప్రస్తుతం ఆమె మూడు సినిమాలు ‘వర్ణ’, ‘రుద్రమదేవి’, ‘బాహుబలి’లలో నటిస్తోంది. ఈ మూడు సినిమాలలో తను కత్తి చేతబట్టి యుద్ధం చేయనుంది. ఈ పాత్రలను చూస్తుంటే ఈ పాత్రలకు తను తప్ప ఇంకొకరు సరిపోవేమో అనిపిస్తుంది. తను ఈ పాత్రలలో నటించి అటు దర్శకులను తన తోటి వారిని మోపిస్తోంది. తను ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాటల్డుతూ ” నేను ఎప్పుడు నా పాత్ర ఎలా వుంది అని చూడను. నాకు స్క్రిప్ట్ నచ్చితే, అలాగే డైరెక్టర్ పై నమ్మకతో ఒప్పుకుంటాను. అలాగే నేను నా తోటి నటులను చాలా ఆరాధిస్తాను . ప్రస్తుతం నేను వారి నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను’ అని అంది. ప్రస్తుతం తను నటిస్తున్న మూడు సినిమాలు ఆమె కీర్తిని మరింత పెంచుతాయని అందరూ బావిస్తున్నారు.

Exit mobile version