మంచు తుఫానులో చిత్రీకరణ జరుపుకున్న అనుష్క,ఆర్య చిత్రం

మంచు తుఫానులో చిత్రీకరణ జరుపుకున్న అనుష్క,ఆర్య చిత్రం

Published on Jul 21, 2012 9:32 AM IST


సెల్వ రాఘవన్ తన జీవితంలో ఎప్పుడు ఊహించని సాహసాలను చేస్తున్నారు. ప్రస్తుతం అయన రాబోతున్న చిత్రం ” బృందావనంలో నందకుమారుడు” చిత్రం కోసం బృందంతో కలిసి జార్జియాలో ఉన్నారు. అనుష్క మరియు ఆర్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతుంది. ఈ మధ్యనే బృందం నివసిస్తున్న భారీ మంచు తుఫాను సంభవించింది . “నిన్న రాత్రి జార్జియాలో భారీ మంచు తుఫాను సంభవించింది. ఇక్కడ విరిగిపోయిన చెట్లు పై కప్పులు లేని ఇల్లులు చూస్తుంటే బాధ వేసింది. దీనిని చిత్రీకరించడం చాలా సులభం కాని అందంగా చిత్రీకరించడం కష్టం” అని ట్విట్టర్లో తెలిపారు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో అనుష్క నటించడం ఇదే మొదటిసారి ఈ చిత్రంలో అనుష్క ద్విపాత్రాభినయం చెయ్యనున్నారు అని సమాచారం. ఈ చిత్రంలో ఒకానొక పాత్ర కోసం ఈ భామ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంది. ఈ చిత్ర తమిళ వెర్షన్ కి “ఇరండాం ఉలగం” అనే పేరుతో రానుంది. ప్రసాద్ వి పోట్లురి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు