మహేష్ బాబు తల్లిగా కనిపించనున్న అను హాసన్

anu_haasan
అందరికీ బాగా తెలిసిన తమిళ్ టీవీ యాంకర్ మరియు హీరోయిన్ అను హాసన్ ‘1-నేనొక్కడినే’ సినిమాలో మహేష్ బాబుకి తల్లిగా కనిపించనుంది. ఆమె సినిమాలో యంగ్ మహేష్ బాబు(ఆ పాత్రని మహేష్ బాబు కొడుకు గౌతమ్ పోషించాడు)కి తల్లిగా కనిపిస్తుంది, ఆ ఎపిసోడ్ మొత్తం సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వస్తుంది. ప్రస్తుతం లండన్ లో షూటింగ్ జరుఒఉకున్తున్న ఈ మూవీలో మహేష్ బాబు సూపర్బ్ స్టైలిష్ అవతారంలో కనిపించనున్నాడు.

సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా కృతి సనన్ హీరోయిన్ గా తెలుగు వారికి పరిచయమవుతోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2014 సంక్రాంతి రిలీజ్ అవుతుందని అందరూ ఆశిస్తున్నారు.

Exit mobile version