నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటించిన “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా ఇటీవల గ్రాండ్ రిలీజ్ కు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహించిన “ది గర్ల్ ఫ్రెండ్” సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ మూవీలో దుర్గ క్యారెక్టర్ లో నటించిన ఎక్స్పిరీయన్స్ను మీడియాతో పంచుకుంది యంగ్, టాలెంటెడ్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్.
– “ది గర్ల్‌ఫ్రెండ్” సినిమాకి ప్రొడ్యూసర్ ధీరజ్ నుంచి కాల్ వచ్చింది. రాహుల్ కథ చెప్పిన తర్వాత నా పాత్ర చాలా నచ్చింది. అమ్మాయిల గురించి మంచి సందేశం చెప్పే ఈ సినిమాలో నటించడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ కావడంతో నమ్మకంగా చేశాను. సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఉంది. అయితే నేను ఎప్పుడూ ప్రశంసల కోసం కాకుండా, మనసుకు నచ్చిన పాత్రలకే ప్రాధాన్యం ఇస్తాను.
– పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, నాని, నాగ చైతన్య వంటి స్టార్లతో నటించాను. కానీ కొన్ని కమర్షియల్ సినిమాలు సంతృప్తి ఇవ్వలేదు. ఇకపై అలాంటి చిత్రాలు చేయకూడదని నిర్ణయించుకున్నాను. ది గర్ల్‌ఫ్రెండ్ లాంటి మీనింగ్‌ఫుల్ సినిమాలు చేయడం నాకు ఆనందం ఇస్తుంది.
– ఈ సినిమాలో నేను దుర్గ పాత్రలో నటించాను. మొదట ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అనిపించింది, కానీ రాహుల్ గారి గైడెన్స్‌తో సహజంగా చేయగలిగాను. ఆయన సెన్సిటివ్ డైరెక్టర్.. ప్రతి పాత్రను జాగ్రత్తగా తీర్చిదిద్దారు. మొదట నేను ఓవర్‌యాక్షన్ చేశానేమో అనిపించింది. కానీ ఆయన టోన్ తగ్గించి సహజంగా నటించమన్నారు. నా డబ్బింగ్ నేనే చెప్పాను. అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడమన్నారు. దాంతో దుర్గ పాత్ర మరింత నేచురల్‌గా, రియలిస్టిక్‌గా కనిపించింది.
– ప్రొడ్యూసర్ ధీరజ్ తో గతంలో ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా చేశాను. “ది గర్ల్ ఫ్రెండ్” లాంటి చిత్రాలు వర్కవుట్ కావాలంటే ధీరజ్ లాంటి మంచి ప్రొడ్యూసర్ ఉండాలి. మంచి టీమ్ కుదరకే గతంలో కొన్ని ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ ఆదరణ పొందలేకపోయాయి. మా మూవీలో చూపించినట్లు మహిళకు ఎన్నో కండీషన్స్ ఈ సొసైటీ పెడుతుంటుంది. ఎలా మాట్లాడాలి, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, పిల్లలు ఎప్పుడు కనాలి..ఇలాంటి షరతులెన్నో వుమెన్ పై ఉంటాయి. మగవారికి ఉద్యోగం, సంపాదన తప్ప మిగతా ఇలాంటి కండీషన్స్ ఏవీ ఉండవు. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్ట్స్ డిస్కషన్స్ స్టేజ్ లో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను.


