ఎ ఎన్ ఆర్ కు క్యాన్సర్

ANR-Press-Meet

డా. అక్కినేని నాగేశ్వర్ రావు (90) ఈ రోజు అన్నపూర్ణ స్టూడియో లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు క్యాన్సర్ వచ్చినట్లు డాక్టర్లు నిర్దారించారని తెలియజేశారు. అక్టోబర్ 8వ తేదిన కడుపులో నొప్పిరావడంతో హాస్పటల్ కు వెళ్లనని వారు పరీక్ష చేసి తనకు క్యాన్సర్ వచ్చినట్టు నిర్దారించారని అన్నాడు. అయితే క్యాన్సర్ వచ్చినంత మాత్రన చనిపోతారని అనుకోవడం తప్పని గుండె దైర్యం, మనోబలం వుంటే క్యాన్సర్ ను కూడా జయించి బ్రతకవచ్చు అని అన్నారు. తన గురించి అభిమానులు మనస్థాపం చెంది తనను మనస్థాపానికి గురి చేయవద్దని అన్నారు. బ్రతికినంత కాలం నవ్వుతూ బ్రతకాలని అన్న ఆయన ప్రజల ఆశీర్వాదం ఉంటే తను 96 సంవత్సరాలు బ్రతుకుతానని గట్టినమ్మకం వుందని అన్నారు.

నాగేశ్వర్ రావు గారు ఇప్పటి వరకు తెలుగు, తమిళ సినిమాలో నటించారు. ప్రస్తుతం ఆయన అక్కినేని మల్టీ స్టారర్ సినిమాగా తెరకెక్కుతున్న ‘మనం’ లో నటిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, నాగ చైతన్య లు హీరోలుగా, శ్రియ, సమంత హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Exit mobile version