అక్కినేని ఫ్యామిలీలోని మూడు తరాల నటీనటులైన ఎ.ఎన్.ఆర్, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న సినిమా ‘మనం’. విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో సమంత, శ్రియ సరన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ లో నాగ చైతన్య – సమంత లపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసారు. తాజా సమాచారం ప్రకారం ఎ.ఎన్.ఆర్, నాగార్జున ఆగష్టు మొదటి వారం నుండి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. ఈ సినిమాలో నాగార్జున ఓ ముఖ్యమైన పాత్రలో శ్రియతో కలిసి కనిపిస్తాడు. ఈ సినిమా మొత్తాన్ని మరో 60 రోజుల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి విక్రం కుమార్ తో కలిసి హర్ష వర్ధన్ డైలాగ్స్ అందిస్తున్నాడు.