డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు, ఆయన తరువాతి తరం హీరో అక్కినేని నాగార్జున, ఆయన తరువాతి తరం హీరో అయిన నాగచైతన్య కలిసి నటిస్తున్న సినిమా ‘మనం’. తెలుగు సినీ చరిత్రలోనే ఇలా మొట్టమొదటిసారిగా ఒక కుటుంబంలోంచి మూడు తరాల నటులు కలిపి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇప్పుడు ఈ నెల 8 నుండి ఏ.ఎన్.ఆర్, నాగార్జున ఈ చిత్ర చిత్రాకరణ బృందంతో కలవనున్నారు
విక్రం కుమార్ ఈ సినిమాకు దర్శకుడు. నాజర్జునకు జంటగా శ్రియ నటిస్తుంది. రిలయాన్స్ ఎంటర్టైన్మెంట్స్ తో జంటగా ఈ సినిమాను నాగార్జున నిర్మిస్తున్నారు
ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. వైవిధ్యమైన స్క్రీన్ ప్లే తో ఈ సినిమా కధ నడవనుందని సమాచారం