నందమూరి నటసింహం బాలకృష్ణ మరియు మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను ల కాంబో అంటే మన టాలీవుడ్ ఆడియన్స్ లో యమా క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబోలో ఇప్పటి వరకు వచ్చిన రెండు చిత్రాలు కూడా ఒకదానిని మించి మరొకటి భారీ హిట్ కావడంతో ఇప్పుడు హ్యాట్రిక్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
పైగా టీజర్ కూడా ఏమాత్రం తగ్గకుండా పవర్ ఫుల్ గా ఉండేసరికి మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే బోయపాటి సినిమాలు అంటే అందులో విలన్స్ ను ఏ రేంజ్ లో చూపిస్తారో తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాకు ఒక ప్రముఖ వ్యక్తిని విలన్ గా చూపించనున్నారని టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు మరో పవర్ ఫుల్ విలన్ రోల్ చేసే నటుని పేరు వినిపిస్తుంది.
ఇప్పటి వరకు మన తెలుగు మరియు ఇతర భాషల్లో ఎన్నో బలమైన ప్రతినాయకుని పాత్రల్లో కనిపించిన సోను సూద్ ను ఎన్నుకోనున్నట్టుగా బజ్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ లాక్ డౌన్ సమయంలో రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్ ను బోయపాటి ఎలా ప్రెజెంట్ చేయనున్నారా తెలియాల్సి ఉంది.