యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ వండర్ “రౌద్రం రణం రుధిరం”. అల్లూరిగా చరణ్ కొమరం భీం గా తారక్ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను ఇంకా పెంచే విధంగా ఇద్దరి పాత్రలను జక్కన చెక్కిన విధానం జస్ట్ వారి టీజర్స్ చూస్తేనే అర్ధం అవుతుంది.
అయితే ఇటీవలే విడుదల కాబడిన మోస్ట్ అవైటెడ్ టీజర్ కొమరం భీం టీజర్ మన తెలుగులో ఎన్నడూ లేని సంచలన రికార్డులను నమోదు చేస్తుంది. గత అక్టోబర్ 22న స్టార్ట్ అయిన తారక్ తుఫాన్ అప్పుడే మొట్ట మొదటి 1 మిలియన్ లైక్స్ సాధించిన మొట్ట మొదటి తెలుగు టీజర్ గా నెవర్ బిఫోర్ రికార్డును నెలకొల్పగా ఇప్పుడు మరో సెన్సేషనల్ రికార్డును సెట్ చేసింది.
ఈ టీజర్ కు ఇప్పుడు మన తెలుగులో ఏ టీజర్ కు రాని విధంగా ఏకంగా లక్షకు పైగా కామెంట్స్ పడ్డాయి. దీనితో ఈ నెవర్ బిఫోర్ రికార్డు కూడా తారక్ ఖాతాలో పడ్డట్టు అయ్యింది. మొత్తానికి మాత్రం చాలా కాలం నిరీక్షణకు జక్కన ఇచ్చిన గిఫ్ట్ తో తారక్ అభిమానులు అప్పటి ఆకలి మొత్తం ఇలా తీర్చేసుకుంటున్నారని చెప్పాలి. ఈ భారీ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా డీవీవీ దానయ్య దాదాపు 400 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.