యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఇక ఈ చిత్రం నుంచి గొండు బెబ్బులి కొమరం భీం గా తారక్ పై డిజైన్ చేసిన టీజర్ అయితే మరో స్థాయికి వెళ్ళింది.
ఈ టీజర్ తో తారక్ అయితే తెలుగులో ఏ ఒక్క రికార్డు లెక్కను కూడా వదలకుండా వేటాడేసాడు. ఇంకా వ్యూస్ పరంగా బాకీ ఉన్నా మరికొన్ని రోజుల్లో అది కూడా బద్దలు అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ టీజర్ తో మన టాలీవుడ్ లో మొట్ట మొదట 1 మిలియన్ లైక్డ్ టీజర్ గా నెవర్ బిఫోర్ రికార్డును తన వాసం చేసుకున్న యంగ్ టైగర్ ఇప్పుడు అలాంటిదే మరో సెన్సేషనల్ రికార్డును సెట్ చేసాడు.
ఒక్క సెకన్..తారక్ కు అతని అభిమానులు అందించారని చెప్పాలి. మరి ఈసారి మొట్ట మొదటి 1 మిలియన్ కామెంట్స్ చేసిన టీజర్ గా రికార్డులకు ఎక్కింది. దీనితో మరో మాసివ్ రికార్డ్ తారక్ కంట్రోల్ లోకి వచ్చేసింది. మొత్తానికి మాత్రం తారక్ ఫ్యాన్స్ ఒక సరైన గిఫ్ట్ నే ఈ కొత్త సంవత్సరానికి అందించారు.