మరో స్టైలిష్ లుక్ తో స్టన్ చేస్తున్న ప్రభాస్.!

మరో స్టైలిష్ లుక్ తో స్టన్ చేస్తున్న ప్రభాస్.!

Published on Nov 4, 2020 3:00 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్” ఆల్ మోస్ట్ ముగింపు దశకు వచ్చేసిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా ప్లాన్ చేసిన ఇటలీ షెడ్యూల్ ను మేకర్స్ విజయవంతంగా పూర్తి చేసుకొని ఇండియాకు తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే గత నెలలో ప్రభాస్ బర్త్ డే ఉండడంతో ప్రభాస్ కు సంబంధించి లేటెస్ట్ లుక్స్ అలాగే రాధే శ్యామ్ ఆన్ లొకేషన్ ఫొటోస్ చాలానే బయటకు వచ్చాయి.

అంతే కాకుండా అవి కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు అలానే మరో కొత్త ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రాధే శ్యామ్ డ్రెస్సింగ్ లోనే మెస్రాటి లగ్జరీ కారు పక్కన స్టైలిష్ గా నిల్చొని ఉన్న ఈ సరికొత్త ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో అభిమానులు మరియు సినీ వర్గాల్లో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. ఈ భారీ ఎపిక్ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే యూవీ క్రియేషన్స్ వారు భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు