“ఆదిపురుష్” హీరోయిన్ పై మరో గాసిప్..రియాక్షన్ తేడాగా ఉందే.!

“ఆదిపురుష్” హీరోయిన్ పై మరో గాసిప్..రియాక్షన్ తేడాగా ఉందే.!

Published on Nov 13, 2020 6:02 PM IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న “రాధే శ్యామ్” ఆల్ మోస్ట్ కంప్లీట్ కావాల్సి వచ్చిన నేపథ్యంలో ఇక దీని తర్వాత చేయనున్న “ఆదిపురుష్” పైనే అందరి కళ్ళు పడ్డాయి. ప్రభాస్ మొట్ట మొదటిసారిగా డైరెక్ట్ బాలీవుడ్ ఫిల్మ్ అందులోను తెలుగు భాషలో కూడా ఏకకాలంలో చేస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే క్యాస్టింగ్ పరంగా దర్శకుడు ఓంరౌత్ రాముని పాత్రలో ప్రభాస్ ను రావణ పాత్రలో సైఫ్ అలీఖాన్ లు చేస్తున్నారని రివీల్ చేసేసాడు. కానీ ఇంకా సీతాదేవి పాత్రలో ఎవరు కనిపిస్తారు అన్నది మాత్రం ఇంకా తేలలేదు. దీనితో ఈ గ్యాప్ లో గాసిప్స్ గుప్పుమంటున్నాయి.

వాటిలో అయితే బాలీవుడ్ నుంచే ఓ హీరోయిన్ ను పిక్ చేసుకుంటారని టాక్ వచ్చింది. ఎక్కువగా అయితే కియారా అద్వానీ, అలాగే కృతి సనన్ ల పేర్లే ఎక్కువగా వినిపించాయి. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా మరో హీరోయిన్ అనన్య పాండే పేరు ఈ రోల్ కు రేస్ లోకి వచ్చింది.

అయితే ఈ విషయంలో మాత్రం ఓవరాల్ గా ఆడియెన్స్ నుంచి అంత సుముఖమైన రెస్పాన్స్ కనిపించడం లేదు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు