‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయం అయింది గ్లామర్ బ్యూటీ ‘నభా నటేష్’. ఆ తరువాత ఇస్మార్ట్ శంకర్ లో కథానాయకిగా నటించి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో గ్లామర్ తో యూత్ ని బాగా ఆకట్టుకుంది ఈ కన్నడ భామ. అయితే నాభ నటేష్ కి తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు తగ్గుతున్నాయని అర్ధం చేసుకుని.. ప్రస్తుతం తమిళం పై ఫుల్ ఫోకస్ పెట్టి.. అక్కడ మంచి అవకాశాలనే అందుకుంటుందని తెలుస్తోంది.
తాజాగా విక్రమ్ – హరి కలయికలో రాబోతున్న యాక్షన్ డ్రామాలో నభాకు హీరోయిన్ గా అవకాశం వచ్చిందని వార్తలు వస్తున్నాయి. దీనికితోడు తమిళంలో జయం రవి, విశాల్ లాంటి హీరోలతో కూడా సినిమాలు చేయనుందట. ఈ యంగ్ బ్యూటీ టాలీవుడ్ లో చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే ఫామ్ లోకి వచ్చి మంచి ఫేమ్ తెచ్చుకుని ఆ రకంగా ముందుకుపోతుంది.