మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలకు వినసొంపైన సంగీతాన్ని అందించాడు. కానీ అతని ప్రతిభను ఇప్పటివరకూ ఏ పెద్ద బడ్జెట్ సినిమా బృందం గుర్తించలేదు. అయతే ఇప్పుడు ఈ యువ టాలెంట్ ను యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ గుర్తించి తన తదుపరి చిత్రానికి అవకాశం ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ చెన్నైలో రికార్డింగ్ పనులలో వున్నాడు.
ఈ సినిమాలో సమంత హీరోయిన్. బెల్లంకొండ సురేష్ నిర్మాణంలో ‘కందిరీగ’ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మధ్యే ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.
ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. ఈ అపురూప అవకాశాన్ని అనూప్ సద్వినియోగం చేసుకుంటాడని ఆశిద్దాం