విడుదల తేదీ : సెప్టెంబర్ 19, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : అంకిత్ కొయ్య, నీలఖి పాత్రా, విజయ నరేష్ కృష్ణ, వాసుకి ఆనంద్, ప్రసాద్ బెహరా మరియు ఇతరులు
దర్శకుడు : జె ఎస్ ఎస్ వర్ధన్
నిర్మాత : ఆడిదల విజయపాల్ రెడ్డి
సంగీత దర్శకుడు : విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రాఫర్ : శ్రీ సాయికుమార్ దారా
ఎడిటర్ : ఎస్ బి ఉద్ధవ్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో యువ హీరో అంకిత్ కొయ్య నటించిన లవ్ చిత్రం “బ్యూటీ” కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
ఒక చిన్నపాటి క్యాబ్ డ్రైవర్ నారాయణ (నరేష్) తన కూతురు అలేఖ్య (నిలఖి పాత్రా) అంటే ఎంతో ప్రేమ. ఆమె కోరింది అని ఒక స్కూటీని ఎంతో కష్టపడి ఆమెకి కొనిస్తాడు. ఇంకోపక్క ఈ యువతి అర్జున్ (అంకిత్ కొయ్య) అనే యువకుడితో ప్రేమలో పడుతుంది. ఇది తన తల్లి (వాసుకి) కి తెలిసిపోవడంతో ఆమె అతనితో కలిసి హైదరాబాద్ కి పారిపోతుంది. కానీ ఆ తర్వాతే ఒక ఊహించని మలుపు కథనంలో జరుగుతుంది. మరి ఆ మలుపు ఏంటి? ఎంతో గారాబంగా చూసుకున్న కూతురు కనిపించకపోయేసరికి నారాయణ ఏం చేసాడు? ఆ యువ జంట ఎక్కడికి వెళ్లారు? చివరికి నారాయణ తన కూతురిని కనుక్కున్నాడా లేదా? అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ చిత్రంలో యువ నటీనటులు బాగానే షైన్ అయ్యారని చెప్పవచ్చు. యంగ్ హీరో అంకిత్ కొయ్య ఇన్ని రోజులు కొంచెం ఎంటర్టైనింగ్ పాత్రల నుంచి ఇది కొంచెం భిన్నంగా అనిపిస్తుంది. తనలోని రెండు షేడ్స్ ని తాను బాగా హ్యాండిల్ చేసాడు. అలాగే యంగ్ నటి నిలఖి పాత్రా తన రోల్ లో బాగా చేసింది. తమ ఇద్దరి నడుమ కొన్ని సీన్స్ బాగున్నాయి.
ఇక సీనియర్ నటుడు నరేష్ మరోసారి తన వెర్సటాలిటీ చూపించారు. తన కూతురు విషయంలో తాను పడే తపన, పలు ఎమోషన్స్ ఎంతో జెన్యూన్ గా కనిపిస్తాయి. తనపై పలు సన్నివేశాలు తండ్రీ కూతుళ్ళ తరహా సినిమాలు ఇష్టపడేవారికి కనెక్ట్ అవుతాయి. అలాగే ఒక మిడిల్ క్లాస్ తల్లిగా వాసుకి బాగా చేశారు. అలాగే సెకండాఫ్ లో ఓ ట్విస్ట్ మంచి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాలో కనిపించే లైన్ ప్రస్తుత జెనరేషన్ కి సంబంధించిందే అయినప్పటికీ దీనిని తెరకెక్కించిన విధానం మాత్రం సినిమా చూసే వీక్షకులకు నిరుత్సాహాన్ని మిగులుస్తుంది. ముఖ్యంగా ఫస్టాఫ్ ని బాగా సాగదీసి వదిలారు. అనవసర బోరింగ్ సీన్స్ తో కథనాన్ని పేలవంగా మార్చేశారు. లీడ్ జంట నడుమ పలు సన్నివేశాలు బాగా ఓవర్ గా క్రింజ్ గా కూడా అనిపిస్తాయి.
ఇక సెకండాఫ్ లో ఆ ట్విస్ట్ తర్వాత కథనం ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా అనుకుంటే అది ఉండదు. సన్నివేశాలు అసహజంగా ఫోర్స్డ్ గా అనిపిస్తాయి. కథనంలో ట్విస్ట్ చోటు చేసుకునేటప్పటికే ఆడియెన్స్ కి సినిమాకి కనెక్షన్ తెగిపోతుంది. ఇక సినిమాలో లవ్ ట్రాక్ చాలా సిల్లీ గా ఉంటుంది. వారి లవ్ ట్రాక్ ఏదో ఇమ్మెచ్యూర్ గా చిన్న పిల్లల ప్రేమ కథలా కనిపిస్తాయి.
అలాగే నటుడు ప్రసాద్ బెహరా రోల్ కూడా సినిమాలో ఏమంత ఇంపాక్ట్ చూపించదు. అలాగే హీరోయిన్ పై కూడా పలు సన్నివేశాలు చాలా ఇరిటేటింగ్ గా కూడా ఉంటాయి. అలాగే నరేష్ కి తన కూతురు నడుమ సన్నివేశాలు ఎమోషనల్ పరంగా ఇంకొంచెం బాగా ఇంప్రూవ్ చేయాల్సింది.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు. విజయ్ బుల్గానిన్ సంగీతం బాగుంది. శ్రీ సాయి కుమార్ కెమెరా వర్క్ కూడా పర్వాలేదు. ఎడిటింగ్ బెటర్ గా చేయాల్సింది. ఇక దర్శకుడు వర్ధన్ విషయానికి వస్తే.. తాను ప్రస్తుత జెనరేషన్ కి రిలేటెడ్ లైన్ ని తీసుకున్నారు కానీ దానిని ఆసక్తికరంగా నడపడంలో మాత్రం విఫలం అయ్యారని చెప్పాలి. స్క్రీన్ ప్లే పరంగా మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సింది. కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ వరకు ఓకే కానీ లీడ్ జంట నడుమ సన్నివేశాలు, వారి ట్రాక్ ని బెటర్ గా డిజైన్ చేసుకుని ఉంటే బాగుండేది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ “బ్యూటీ” చిత్రం ఒక బోరింగ్ అండ్ సిల్లీ లవ్ డ్రామా అని చెప్పాలి. నరేష్ పై ఎక్కడో కొన్ని మూమెంట్స్ తప్పితే మిగతా సినిమాలో మెప్పించే అంశాలు పెద్దగా ఉండవు. ఒక సిల్లీ లవ్ ట్రాక్, పేలవమైన స్క్రీన్ ప్లే ఈ చిత్రం చూసే ఆడియెన్స్ ని నిరుత్సాహ పరుస్తాయి. అందరికీ కనెక్ట్ అయ్యే లైన్ ని దర్శకుడు మెప్పించే విధంగా తెరకెక్కించలేకపోయారు. వీటితో ఈ వారాంతానికి మరో సినిమా ఎంచుకుంటే మంచిది.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team