విశాల్ కొత్త సినిమాలో తాప్సీ ప్లేసులో అంజలి


అంగాడి తెరు (తెలుగులో ‘షాపింగ్ మాల్’), ఎంగేయుం ఎప్పోదుం (తెలుగులో ‘జర్నీ’) సినిమాల ద్వారా మంచి నటిగా పేరు తెచ్చుకొని అటు తమిళ ప్రేక్షకులకి ఇటు తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన నటి అంజలి. ప్రస్తుతం ఈమెకి తమిళ్లో బాగానే అవకాశాలు దక్కించుకుంటుంది. ఇటీవలే ఆమె నటించిన కలకలప్పు అనే సినిమా విజయం సాధించగా ఆర్య సరసన సెట్టై అనే సినిమాలో మరియు తెలుగులో భారీ మల్టి స్టారర్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో వెంకటేష్ సరసన నటిస్తుంది. సుందర్ సి డైరెక్షన్లో విశాల్ హీరోగా ‘మధ గజ రాజా’ అనే సినిమా తెరకెక్కనుండగా మొదటగా ఈ సినిమాలో కథానాయికగా తాప్సీని అనుకున్నారు. తాప్సీ ఈ సినిమాలో నటించానని చెప్పడంతో ఆమె ప్లేసులో తాప్సీని తీసుకున్నారు. వరలక్ష్మి ముఖ్యమైన పాత్రలో నటిస్తుండగా సంతానం మరియు గాయత్రి ఇతర పాత్రల్లో నటించనున్నారు.

Exit mobile version