ముంబై లో ‘అంజాన్’ తదుపరి షెడ్యూల్

Anjaana
సూర్య తాజా చిత్రం’అంజాన్’ షూటింగ్ శరవేగం తో సాగుతుంది. ఈ చిత్రం యొక్క చాలాభాగం గత కొన్ని నెలలుగా చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలోని ముఖ్య సన్నివేశాలను మహారాష్ట్ర లో చిత్రీకరిస్తున్నారు. ఇటివలే ఒక మాస్ పాటని సూర్య సమంత ల మహారాష్ట్రలోని పంచగనిలో చిత్రీకరించారు. యెన్.లింగుస్వామి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

చిన్న విరామం తర్వాత ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ ముంబై లో మార్చి 5 నుండి మొదలు కానుంది. ఈ షెడ్యూల్ లో సూర్య పాల్గొనున్నాడు. ఈ చిత్ర యూనిట్ మొత్తం ముంబై రానున్న కొన్ని వారాలు షూటింగ్ లో పాల్గోనుంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం లో సూర్య రెండు వేరు వేరు లుక్స్ లో కనబడనున్నాడు. అయితే అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఇంటర్నెట్ లో సూర్య సమంత ల పై చిత్రీకరించిన ఒక పాటలోని చిత్రాలు బయటపడినప్పటి నుండి సమంతా మేక్ఓవర్ పై చాలా అంచనాలు పెరిగాయి
.
యువన్ శంకర రాజా సంగీతం అందిస్తున్న ఈ ఏక్షన్ థ్రిల్లర్ కి సంతోష్ శివన్ ఛాయాగ్రహణం అందించారు. ఈ చిత్రాన్ని యు.టి.వి మోషన్ పిక్చర్స్ మరియు తిరుపతి బ్రదర్స్ సంయుక్తంగా నిర్మించారు.

Exit mobile version