“సంక్రాంతికి వస్తున్నాం” రీమేక్.. హిందిలో ఆ స్టార్ హీరోతో

ఇటీవల మన తెలుగు సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా సక్సెస్ ఫుల్ దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన సెన్సేషనల్ హిట్ చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం” కూడా ఒకటి. మరి రీజనల్ గా భారీ గ్రాసర్ గా నిలిచిన ఈ చిత్రం ఇంకా సాలిడ్ రన్ ని తెలుగు స్టేట్స్ సహా యూఎస్ మార్కెట్ లో కూడా అదరగొడుతుంది.

అయితే ఈ చిత్రంని హిందీలో రీమేక్ చేసే ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానని దర్శకుడు అనీల్ చెబుతున్నాడు. హిందీలో రీమేక్ చేసేందుకు సిద్ధమే అని అక్కడ ఈ సినిమాని కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో చేస్తానని చెబుతున్నాడు. ఈ సినిమాకి సల్మాన్ హిందీ నుంచి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని అనీల్ రివీల్ చేశారు. మరి ఈ సినిమా హిందీలో రీమేక్ అయ్యే ఛాన్స్ ఉందో లేదో చూడాలి మరి.

Exit mobile version