రాజమౌళి – మహేష్ బాబు కలయికలో ‘వారణాసి’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఐతే, ‘వారణాసి’ ఈవెంట్లో మహేశ్ బాబు ఎద్దుపై వచ్చిన ఎంట్రీ సీన్ చూసి తాను ఆశ్చర్యపోయినట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘వారణాసి’ సినిమా గురించి అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇంతకీ అనిల్ రావిపూడి ఏం మాట్లాడారు అంటే.. ‘ఇటీవల విడుదలైన ‘వారణాసి’ గ్లింప్స్ చూసి మహేశ్‌బాబుకు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడాను. అంత భారీగా, క్రియేటివ్‌గా ఉంటుందని నేను ఊహించలేదు’ అని అనిల్ చెప్పుకొచ్చారు.
అనిల్ రావిపూడి ఇంకా మాట్లాడుతూ.. ‘ఆ గ్లింప్స్‌లోని ప్రతి షాట్ నన్ను షాక్‌కు గురి చేసింది. ప్రతి ఫ్రేమ్ టైమ్ ట్రావెలర్లా అనిపించింది. రాజమౌళి నుంచి మరో అద్భుతం రానుందని ఆ గ్లింప్స్ చూశాక అర్థమైంది’ అని అనిల్ రావిపూడి అన్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి చిరంజీవి హీరోగా “మన శంకర వరప్రసాద్ గారు” సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో మరో హీరో వెంకటేష్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే.
