‘మటన్ సూప్’ బాగుంది.. సక్సెస్ కొట్టాలి – డైరెక్టర్ అనిల్ రావిపూడి

Mutton-Soup

క్రేజీ టైటిల్, డిఫరెంట్ స్టోరీ తో రాబోతున్న క్రైమ్ డ్రామా మూవీ ‘మటన్ సూప్’ టీజర్‌ను దసరా కానుకగా మేకర్స్ రిలీజ్ చేశారు. రామకృష్ణ వట్టికూటి సమర్పణలో, అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC) బ్యానర్లపై రామచంద్ర వట్టికూటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రమణ్ హీరోగా, వర్షా విశ్వనాథ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. “విట్‌నెస్ ది రియల్ క్రైమ్” ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్ర టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్, పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకున్నాయి. తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఈ మూవీ టీజర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “టీజర్ బాగుంది, టైటిల్ అట్రాక్టివ్‌గా ఉంది. కొత్త టీమ్, కొత్త ప్రయత్నం. దర్శకుడు రామచంద్ర, హీరో రమణ్, టీం కి ఆల్ ది బెస్ట్. అక్టోబర్ 10న విడుదల అవుతున్న సినిమాను అందరూ చూసి పెద్ద సక్సెస్ చేయాలి.” అని అన్నారు.

నిర్మాత మల్లిఖార్జున ఎలికా మాట్లాడుతూ.. “టీజర్ లాంచ్ చేయడానికి అనిల్ రావిపూడి గారు ముందుండటం ఆనందంగా ఉంది. మంచి స్క్రీన్ ప్లేతో సినిమా రాబోతోంది. ప్రేక్షకులు వీక్షించి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం.” అన్నారు.

దర్శకుడు రామచంద్ర వట్టికూటి మాట్లాడుతూ.. “టీజర్ లాంచ్ మా అదృష్టం. నిర్మాతలు, హీరో రమణ్, టీమ్ అందరూ అద్భుతంగా పని చేశారు. అక్టోబర్ 10న ప్రేక్షకులు సినిమా చూసి హిట్ చేయాలి.” అన్నారు.

హీరో రమణ్ మాట్లాడుతూ.. “టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. చిత్ర బృందం కష్టపడి రూపొందించిన ఈ సినిమా అక్టోబర్ 10న వస్తోంది. అందరూ చూసి సక్సెస్ చేయాలి.” అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు, నటులు జెమినీ సురేష్, గోవింద్ శ్రీనివాస్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఇక ‘మటన్ సూప్’ చిత్రాన్ని అక్టోబర్ 10న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

Exit mobile version