100 సినిమాలు పూర్తి చేసుకున్న అనిల్ భాను

Anil-Bhanu

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అనిల్ చంద్రకాంత్ – భాను అవిరినేనిలు సినిమా పబ్లిసిటీ డిజైనింగ్ విభాగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరూ ఎబి కోర్ డిజైన్ లేబుల్లో తో ఎన్నో రోజులుగా కలిసి పనిచేస్తున్నారు. ఈ గ్రూప్ వారు ఇప్పటి వరకూ 100 సినిమాలకు పబ్లిసిటీకి సంబందించిన మెటీరియల్ ని డిజైన్ చేసారు. ఈ సందర్భంగా వారి డిజైనింగ్ లకి సంబందించిన ఓ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. అనిల్ – భాను మొట్ట మొదటగా 2002లో కృష్ణ వంశీ తీసిన ‘ఖడ్గం’ సినిమాకి పనిచేసారు. ప్రస్తుతం వారిద్దరూ ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలకు పబ్లిసిటీ డిజైనర్స్ గా పనిచేస్తున్నారు. విజయవంతంగా 100 సినిమాలకు పబ్లిసిటీ డిజైన్స్ చేసిన అనిల్ – భానులకి అభినందనలు తెలియజేస్తున్నాం.

Exit mobile version