యూఎస్ మార్కెట్ లో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సాలిడ్ మార్క్!

Andhra King Thaluka

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే “ఆంధ్ర కింగ్ తాలూకా”. దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కించిన ఈ ఫ్యాన్ బయోపిక్ సినిమా మంచి టాక్ ని తెచ్చుకుంది. అయితే ఈ సినిమాకి యూఎస్ మార్కెట్ లో మంచి వసూళ్లు మాత్రం అలా కొనసాగుతున్నాయి అని చెప్పాలి.

అక్కడ డీసెంట్ స్టార్ట్ తో మొదలైన ఈ సినిమా అదే హోల్డ్ ని కొనసాగిస్తూ ఇప్పుడు హాఫ్ మిలియన్ మార్క్ ని అందుకొని అదరగొట్టింది. ఇలా 5 లక్షల డాలర్స్ తర్వాత ఫైనల్ రన్ ఎక్కడ వరకు వెళుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాకి వివేక్ – మెర్విన్ లు సంగీతం అందించగా మైత్రి మూవీస్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version