ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ నవంబర్ 28న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. దర్శకుడు మహేష్ బాబు పి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ఇక ఈ సినిమా టైటిల్ విషయంపై దర్శకుడు మహేష్ బాబు తాజాగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. తొలుత ఈ సినిమాకు ‘మాస్టర్‌పీస్’ అనే టైటిల్ పెట్టాలని భావించామని.. కానీ, కథకు ఈ టైటిల్ అయితేనే పక్కాగా సెట్ అవుతుందని తాము భావించి ఫిక్స్ చేసినట్లు తెలిపారు.
ఈ సినిమాలో భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్గా నటిస్తుండగా ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
