3 కోట్ల లాజిక్‌పై ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ డైరెక్టర్

Andhra King Thaluka.jpg 2

రామ్ పోతినేని నటించిన “ఆంధ్ర కింగ్ తాలూకా” ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితం అవుతోంది. ఉపేంద్ర స్టార్‌గా కనిపిస్తుండగా, రామ్ ఆయనకు అభిమాని పాత్రలో మెరిశాడు. కథలో, వరుసపెట్టి వచ్చిన ఫ్లాప్‌లతో హీరో ఆర్థికంగా కుదేలవడంతో, రామ్ అతనికి రూ.3 కోట్లు ఇస్తాడు.

అయితే కొంతమంది ప్రేక్షకులు “ఇంత పెద్ద స్టార్ దగ్గర రూ.3 కోట్లు కూడా ఉండవా?” అంటూ లాజిక్‌పై ప్రశ్నలు తలెత్తించారు. దీనిపై దర్శకుడు మహేశ్ బాబు పి. వివరణ ఇచ్చారు. “సూర్య (ఉపేంద్ర పాత్ర) మాట తప్పని వ్యక్తి. ఆయన 100వ సినిమాకు ముందు తొమ్మిది వరుస ఫ్లాప్‌లు వచ్చాయి. ప్రతి సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లకు జరిగిన నష్టాన్ని ఆయన తన సొంతంగా భరించాడు” అని తెలిపారు.

అంతేగాక, ప్రతి విషయాన్ని సినిమాలో చూపించే వీలు ఉండదని.. అప్పటి కాలంలో హీరోలు తమ బయ్యర్ల నష్టాలను చూసుకునేవారనరి.. అప్పుడు రూ. 3 కోట్లు అంటే భారీ మొత్తం.. డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్ల నష్టాలు తీర్చడంలో సూర్య బాగా డబ్బు కోల్పోయాడు.. ప్రేక్షకుల అభిప్రాయాన్ని నేను ఏనాడూ చిన్నచూపు చూడను.. ఆ లాజిక్‌ను ఘటనలతో కాకుండా డైలాగుల ద్వారా చెప్పడంతో కొంతమందికి పూర్తిగా కనెక్ట్ కాలేకపోయింది.. అని తెలిపారు.

Exit mobile version