అదే నిజమైతే అనసూయ దశతిరిగినట్లే.

అదే నిజమైతే అనసూయ దశతిరిగినట్లే.

Published on Feb 4, 2020 9:14 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎన్నడూ లేనంత స్పీడ్ గా వెంటవెంటనే మూడు సినిమాలు ప్రకటించారు. ఆయన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ తో పాటు, క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ మూవీ మరియు గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో మరో మూవీ చేస్తున్నారు. దర్శకుడు క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మొఘలుల కాలం నాటి పీరియడ్ మూవీలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపిస్తారని తెలుస్తున్న సమాచారం.

కాగా ఈ చిత్రంలో స్టార్ యాంకర్ మరియు నటి అనసూయ ఓ కీలక రోల్ చేస్తున్నారట. అలాగే ఆమెది దాదాపు 30నిమిషాల నిడివి కలిగిన ప్రాధాన్యం ఉన్న రోల్ అని తెలుస్తుంది. ఇదే కనుక నిజం అయితే అనసూయ దశ తిరిగినట్లే. గతంలో రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం మూవీలో అనసూయ రంగమత్త అనే కీలక రోల్ చేశారు. ఆ పాత్ర ఆమెకు మంచి నేమ్ తెచ్చిపెట్టింది. ఇక పవన్ 27వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు