పండుగ సినిమా సౌండ్ లేదేంటి..?

పండుగ సినిమా సౌండ్ లేదేంటి..?

Published on Nov 25, 2025 3:00 AM IST

anaganaga-oka-raju-2025

సంక్రాంతికి తప్పకుండా వస్తామని చెప్పిన నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరిల ‘అనగనగా ఒక రాజు’ టీమ్‌ దీపావళి తర్వాత సైలెంట్ అయిపోయింది. ప్రమోషన్లు లేకపోవడం.. ఇప్పటి వరకు ఒక్క లిరికల్ సాంగ్ కూడా రిలీజ్ కాకపోవడంతో అభిమానుల్లో ఈ సినిమాపై ఆసక్తి తగ్గిపోతుంది. మిక్కీ జె. మేయర్ పాటలు సిద్ధంగా ఉన్నా ఎందుకో హోల్డ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.

ఇన్‌సైడ్ టాక్ ప్రకారం ఇంకా దాదాపు 30 రోజుల షూటింగ్ మిగిలి ఉందట. అలాంటప్పుడు జనవరి 14 విడుదల కాస్త క్లిష్టమవుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. నిర్మాత నాగ వంశీ కూడా మీడియా ముందు కనిపించకపోవడంతో ఈ సినిమా పండుగకు వస్తుందా లేదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఇక సంక్రాంతికి రాజా సాబ్, భర్త మహాశయులకు విజ్ఞప్తి వంటి పెద్ద సినిమాలే రెడీగా ఉన్నాయి. ఈ పరిస్థితిలో అనగనగా ఒక రాజు వాయిదా పడితే, రిపబ్లిక్ డే రిలీజ్‌కి షిఫ్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని సినీ సర్కిల్స్ టాక్.

తాజా వార్తలు