అమీ జాక్సన్ ప్రస్తుతం ‘శివతాండవం’ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటోంది. మామూలుగా ఏదో ప్రమోషన్స్ చేశామని కాకుండా ఒక మంచి ఉద్దేశం కోసం పాల్గొంటున్నారు. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా అమీ జాక్సన్ మరియు జగపతి బాబు అంధుల కోసం ఏర్పాటు చేసిన నేషనల్ అసోషియేషన్ కి ఫండ్స్ ఇవ్వాలని ప్రమోట్ చేస్తున్నారు. విక్రమ్ మరియు అనుష్క హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు మరియు లక్ష్మీ రాయ్ లు కూడా ప్రధాన పాత్రలు పోషించారు. ఎ. ఎల్ విజయ్ కుమార్ దర్శకత్వం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎకోలేషణ్ టెక్నిక్ లో సిద్దహస్తుడైన అంధుడైన డానియల్ క్రిష్ అనే ఒక అమెరికన్ ని స్ఫూర్తిగా తీసుకుని విక్రమ్ ఈ సినిమాలో హీరో పాత్రని చేసారు. ఇటీవలే చెన్నై లో జరిగిన ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో విక్రమ్ తో కలిసి డానియల్ క్రిష్ కూడా పాల్గొన్నారు. సి. కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.