మన తెలుగు బుల్లితెర వద్ద ఒక ఎవర్ గ్రీన్ ఎంటర్టైనింగ్ సీరియల్ ఏదన్నా ఉంది అంటే అది “అమృతం” అనే చెప్పాలి. 90స్ కిడ్స్ మోస్ట్ ఫేవరేట్ సీరియల్ కూడా ఇదే. ఎన్నో మధుర జ్ఞాపకాలని అందించిన ఈ సీరియల్ కి ఒక సినిమా అలాగే మళ్ళీ సీజన్ 2 లాంటి సీరియల్ కూడా వచ్చాయి. కానీ మొదటిసారి టెలికాస్ట్ అయ్యిన ఆ ఏడేళ్ల ఎపిసోడ్స్ కి మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఆ ఎపిసోడ్స్ అన్నీ యూట్యూబ్ లో చాలా ఛానెల్స్ లో అనధికారికంగా చాలానే ఉన్నాయి. కానీ ఇపుడు స్వయంగా మేకర్స్ ఈ సీరియల్ ని స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నారు. కానీ పాత సీరియల్ నే ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా రీమాస్టర్ చేసి మంచి క్వాలిటీతో దింపుతున్నారట.
సో ఇది మాత్రం ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ కాగా ఈ ఎపిసోడ్స్ నవంబర్ 24 నుంచి ప్రతీ రోజు రెండు ఎపిసోడ్స్ చొప్పున ప్రసారం కానున్నాయి. దీనితో ఆ డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సీరియల్ లో శివాజీ రాజా, హర్ష వర్ధన్, గుండు హనుమంతురావు, వాసు ఇంటూరి, శివన్నారాయణ తదితరులు నటించారు. అలాగే ఈ ఐకానిక్ సీరియల్ ని గుణ్ణం గంగరాజు సృష్టించి తెరకెక్కించారు.


