ఓటిటిలకి అమీర్ ఖాన్ బిగ్ ట్విస్ట్.. కేవలం స్ట్రీమింగ్ ఇందులోనే!

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఓటిటిల ప్రభావం ఏ రీతిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది ఎంతవరకు వచ్చింది అంటే ఒక పెద్ద సినిమాల రిలీజ్ లని సైతం ఈ ఓటిటిలే నిర్ణయించే పరిస్థితి నెలకొంది. అయితే దీనికి అందరు సుముఖంగా లేరు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్ ఖాన్ అయితే మొదటి నుంచీ వ్యతిరేకంగానే ఉన్నారు.

మరి ఇలా లేటెస్ట్ గా తన రిలీజ్ కి వస్తున్న చిత్రం “సితారే జమీన్ పర్” చిత్రం రిలీజ్ ని మొదట థియేటర్స్ లో చేస్తారట కానీ అసలు ఏ ఓటిటికి కూడా ఈ చిత్రాన్ని ఇవ్వలేదట. కంప్లీట్ గా ఓటిటిని అవాయిడ్ చేసేసారట. మరి 8 వారాలు రిలీజ్ తర్వాత పరిస్థితి ఏంటి అంటే యూట్యూబ్ లో స్ట్రీమింగ్ కి చేయొచ్చట. ఈ సినిమా 8 వారాలు తర్వాత అప్పట్లోలా యూట్యూబ్ లో కొంతమేర రుసుము చెల్లించి స్ట్రీమింగ్ చేయొచ్చట. దీనిపై మరింత క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

Exit mobile version